రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని సీఎస్ సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర వైద్య మండలి ఆధ్వర్యంలో "కొవిడ్ నుంచి నేర్చుకున్న పాఠాలు... భవిష్యత్తు కార్యచరణ" అనే అంశంపై నిర్వహించిన వెబినార్‌లో బీఆర్కే భవన్ నుంచి సీఎస్ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించి వైద్యులు, రోగుల్లో మనోస్థైర్యం నింపారని సీఎస్ పేర్కొన్నారు.
కొత్తగా ఏ వైరస్ వచ్చినా ఎదుర్కోడానికి సిద్ధం: సోమేశ్‌కుమార్ - corona third wave news
రాష్ట్ర వైద్య మండలి ఆధ్వర్యంలో "కొవిడ్ నుంచి నేర్చుకున్న పాఠాలు- భవిష్యత్తు కార్యచరణ" అనే అంశంపై నిర్వహించిన వెబినార్‌లో సీఎస్ సోమేశ్‌కుమార్ పాల్గొన్నారు. మూడో దశను ఎదుర్కునేందుకు ప్రభుత్వం అన్నివిధాలా సిద్ధంగా ఉందని సీఎస్ స్పష్టం చేశారు.
Telangana cs somesh kumar about precautions for corona third wave
కార్యక్రమంలో ఎయిమ్స్ వైద్యులు డాక్టర్ గులేరియా, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, కాళోజి వర్శిటీ వీసీ కరుణాకర్ రెడ్డి, డీఎంఈ రమేశ్ రెడ్డి సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కేసులు తగ్గడానికి సీఎం మార్గదర్శకాలే కారణమని ఈ సందర్భంగా సీఎస్ వివరించారు. మూడో వేవ్ ఎదుర్కోవడం కోసం అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు ఏర్పాటు చేసేందుకు టెండర్లు పిలిచినట్టు వివరించారు.