తెలంగాణ

telangana

ETV Bharat / city

దివ్వాంగ క్రీడాకారులకు పారా స్పోర్ట్స్ అకాడమీ

దివ్వాంగులైన క్రీడాకారుల కోసం ఆసియాలోనే మొదటిసారిగా అత్యాధునిక పారా స్పోర్ట్స్​ రిహాబిలిటేషన్​, ట్రైనింగ్​ అకాడమీ హైదరాబాద్​లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, సినీ నటి మంచు లక్ష్మీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

దివ్వాంగ క్రీడాకారులకు పారా స్పోర్ట్స్ అకాడమీ

By

Published : Nov 16, 2019, 6:50 PM IST

దివ్వాంగులకు చేయూత అందించేందుకు క్రీడల్లో వారి స్వీయ ఎదుగుదలకు కృషి చేస్తున్న ఆదిత్య మెహతా ఫౌండేషన్ ఆసియాలోనే మొట్టమొదటి అత్యాధునిక పారా స్పోర్ట్స్ పునరావాసం, శిక్షణ అకాడమీని ప్రారంభించింది. ఇన్ఫినిటీ పారా స్పోర్ట్స్ అకాడమీ రిహాబిలిటేషన్ సెంటర్​ను బేగంపేటలోని మెహత అపార్ట్​మెంట్​లో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, సినీ నటి మంచు లక్ష్మీ ప్రారంభించారు.

అంగవైకల్యం ఉన్న ప్రతిభావంత క్రీడాకారులకు ఈ అకాడమీ ఎంతగానో సహాయ పడుతుందని వారు అన్నారు. సంస్థ స్ఫూర్తి, నిబద్ధత ఎంతో గొప్పదని కొనియాడారు. ఐదు వేల చదరపు గజాల స్థలంలో ప్రతి పేద క్రీడాకారులకు అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు. దివ్వాంగ క్రీడాకారులను తన సొంత కుటుంబంగా భావిస్తున్ననట్లు సంస్థ నిర్వాహకులు ఆదిత్య మెహతా అన్నారు.

దివ్వాంగ క్రీడాకారులకు పారా స్పోర్ట్స్ అకాడమీ

ఇదీ చూడండి: సమ్మెపై హైకోర్టులో ఆర్టీసీ అదనపు కౌంటర్

ABOUT THE AUTHOR

...view details