రైతులకు మెరుగైన సేవలు అందించండంలో నాబార్డు దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ వెల్లడించారు. సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన జరిగిన నాబార్డు ఉన్నతస్థాయి కమిటీ సమావేశానికి టెస్కాబ్ ఛైర్మన్ రవీందర్‌రావు, అధికారులు హాజరయ్యారు. 795 ప్రాథమిక సహకార సంఘాలను కంప్యూటరీకరించి ఆదర్శంగా నిలిచారని సోమేశ్‌కుమార్ కొనియాడారు.
అన్ని గ్రామాలకు నాబార్డ్ సేవలు: సీఎస్ - సీఎస్ సోమేశ్‌కుమార్ తాజా వార్తలు
సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన నాబార్డు ఉన్నతస్థాయి కమిటీ సమావేశం జరిగింది. 795 పీఏసీఎస్‌లను కంప్యూటరీకరించి దేశంలోనే ఆదర్శంగా నిలిచారని టెస్కాబ్ ఛైర్మన్ రవీందర్‌రావుతో పాటు ఇతర అధికారులను సీఎస్ అభినందించారు.
అన్ని గ్రామాలకు నాబార్డ్ సేవలందేలా శాఖల ఏర్పాటు: సీఎస్
రైతులకు సేవలు అందించేందుకు యాప్ రూపొందించాలని సీఎస్ సూచించారు. రైతులకు మెరుగైన సేవల కోసం అధికారులకు కార్యశాల నిర్వహిస్తామని తెలిపిన సోమేశ్ కుమార్... అన్ని గ్రామాలకు సేవలందేలా శాఖల ఏర్పాటుపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
ఇవీ చూడండి:ఎన్ని పరిశ్రమలొచ్చినా వ్యవసాయమే ఆధారం: కిషన్ రెడ్డి