తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంలో మూడువేలు దాటిన కరోనా కేసులు - తెలంగాణలో కరోనా కేసులు

corona toll raised to three thousand in telangana
రాష్ట్రంలో మూడువేలు దాటిన కరోనా కేసులు

By

Published : Jun 3, 2020, 8:39 PM IST

Updated : Jun 3, 2020, 9:43 PM IST

15:45 June 03

రాష్ట్రంలో మూడువేలు దాటిన కరోనా కేసులు

 రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3 వేలు దాటింది. బుధవారం కొత్తగా 129 మందికి కరోనా సోకింది. 127 మంది రాష్ట్ర వాసులు, ఇద్దరు వలస కూలీలు వైరస్​ బారిన పడ్డారు. జీహెచ్ఎంసీ పరిధిలో 108 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 3,020కి చేరింది. ఇందులో రాష్ట్రవాసులు 2,572, వలస కూలీలు 448 మందికి కొవిడ్​-19 సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

       రంగారెడ్డి, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో 6 చొప్పున కొవిడ్​-19 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌, సిరిసిల్ల జిల్లాల్లో ఇద్దరికి కరోనా సోకింది. యాదాద్రి, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఒక్కో కరోనా కేసు నమోదయింది.  

     రాష్ట్రంలో కరోనా బారిన పడి బుధవారం మరో ఏడుగురు మృతిచెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 99 మంది మృత్యువాతపడ్డారు.  

ఇవీచూడండి:చికెన్ గున్యా వ్యాక్సిన్ అభివృద్ధికి భారత్ బయోటెక్​తో ఒప్పందం


 

Last Updated : Jun 3, 2020, 9:43 PM IST

ABOUT THE AUTHOR

...view details