రాష్ట్రంలో వైరస్ విజృంభణ కొనసాగుతోంది. సోమవారం మరో 92 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 3,742కు చేరింది. మహమ్మారికి మరో ఐదుగురు బలవగా, మొత్తం వైరస్ మృతుల సంఖ్య 142కు చేరింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిలో జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు లేని 393 మందిని స్వీయ ఐసోలేషన్‌కు పంపారు. వీరిలో 310 మందిని హోం క్వారంటైన్‌కు, ఇంట్లో ప్రత్యేక గది వసతిలేని 83 మందిని అమీర్‌పేటలోని ప్రకృతి చికిత్సాలయానికి తరలించారు. కరోనా నుంచి కోలుకుని 67 మంది డిశ్చార్జీ అయినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. ప్రస్తుతం ఐసీయూలో 300 మంది, వార్డుల్లో 210 మంది చికిత్స పొందుతున్నారని వివరించారు. వారిలో వైద్యులు, పోలీసులు, జర్నలిస్టులూ ఉన్నట్లు రాజారావు పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఆగని వైరస్ వ్యాప్తి.. కొత్తగా మరో 92 కేసులు
22:23 June 08
రాష్ట్రంలో ఆగని వైరస్ వ్యాప్తి.. కొత్తగా మరో 92 కేసులు
గాంధీ ఆసుపత్రి వైద్యులు మరో ఘనత సాధించారు. హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి కొవిడ్ బారిన పడగా.. ప్లాస్మా థెరపీతో ఆయన ప్రాణం నిలబెట్టారు. మలక్‌పేట్‌కు చెందిన ఓ వ్యక్తికి మే 12న పాజిటివ్ వచ్చింది. గాంధీ ఆసుపత్రిలో ఐసీయూలో ఉంచి చికిత్స ప్రారంభించారు. ప్లాస్మా థెరపీతో చికిత్స చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పగా.... ఆయన అంగీకరించారు. ఐసీఎంఆర్ అనుమతితో 14, 16 తేదీల్లో 2 సార్లు ప్లాస్మా ఎక్కించారు. మరోసటి రోజు నుంచే ఆరోగ్యం మెరుగుపడింది. పూర్తిగా కోలుకోగా గతనెల 30న ఇంటికి పంపారు.
కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు జీహెచ్‌ఎంసీ చర్యలు కొనసాగుతున్నాయి. కేసులున్న ప్రాంతాల్లో నిత్యం సోడియం హైపో క్లోరైట్ పిచికారి చేస్తూ శానిటైజేషన్‌పై శ్రద్ధ వహిస్తున్నారు.
ఇవీ చూడండి:కరోనా రోగుల కోసం అన్ని సదుపాయాలు ఉన్నాయి : సీఎం కేసీఆర్