దేశం వేగంగా అభివృద్ధి చెందడానికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ నిలవడానికి మూలకారకుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. శాసన మండలి ప్రారంభం కాగానే... పీవీ నరసింహరావుకు భారతరత్న ఇవ్వాలంటూ మంత్రి ఈటల తీర్మానం ప్రవేశపెట్టారు. దేశం సమస్యల సుడిగుండంలో ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించిన గొప్ప నాయకుడని ఈటల కొనియాడారు. భూసంస్కరణ స్పూర్తికి తనే ఆదర్శంగా నిలవాలని తనకున్న తొమ్మిదివందల ఎకరాల భూమిని పీవీ ప్రభుత్వానికి ఇచ్చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
'రాష్ట్రంలో భూసంస్కరణలు అమలుచేసిన ఘనత పీవీదే' - Telangana assembly monsoon session second day
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని శాసనమండలిలో మంత్రి ఈటల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభ్యులందరి మద్దతుతో సభ తీర్మానాన్ని ఆమోదించింది. ఐతే మజ్లీస్ సభ్యులు నేటి సమావేశానికి హాజరుకాలేదు.
'రాష్ట్రంలో భూసంస్కరణలు అమలుచేసిన ఘనత పీవీదే'
ఈటల ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, భాజపా ఎమ్మెల్సీ రామచందర్‌రావుతో పాటు ఇతర సభ్యులంతా మద్దతు తెలిపారు. అనంతరం మండలి తీర్మానాన్ని ఆమోదిస్తూ సభ రేపటికి వాయిదా పడింది. కాగా నేటి సమావేశానికి ఎమ్ఐఎమ్ సభ్యులు హాజరుకాలేదు.
ఇవీ చూడండి:'కేసీఆర్ లేకపోతే పీవీకి గౌరవం దక్కేది కాదు'