రాష్ట్రంలో కొత్తగా 256 కరోనా కేసులు నమోదవ్వగా.. మహమ్మారి బారిన పడి ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,92,128 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ సోకి ఇప్పటివరకు 1,581 మంది మృతి చెందారు. కరోనా నుంచి మరో 298 మంది బాధితులు కోలుకున్నారు.
తెలంగాణలో మరో 256 కరోనా కేసులు, 2 మరణాలు - covid deaths in telangana
తెలంగాణలో కొత్తగా 256 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,92,128 మంది కొవిడ్ బాధితులున్నారు.
తెలంగాణలో కరోనా కేసులు
ఇప్పటివరకు 2,86,542 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 4,005 కరోనా యాక్టివ్ కేసులుండగా.. ప్రస్తుతం 2,283 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 51 కరోనా కేసులు నమోదయ్యాయి.
- ఇదీ చూడండి :కరోనా టీకా తప్పనిసరా? తీసుకోకపోతే ఏమవుతుంది?