రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. తాజాగా మరో 177 మంది వైరస్ బారిన పడ్డారు. మహమ్మారి సోకి ఇద్దరు మృతి చెందారు.
రాష్ట్రంలో మరో 177 కరోనా కేసులు.. ఇద్దరు మృతి - telangana corona cases today
తెలంగాణలో కరోనా ఉద్ధృతి నెమ్మదిగా తగ్గుతోంది. రాష్ట్రంలో తాజాగా మరో 177 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందారు.
రాష్ట్రంలో మరో 177 కరోనా కేసులు
తెలంగాణలో ఇప్పటివరకు 2,95,101 కరోనా కేసులు నమోదవ్వగా.. ఇప్పటివరకు 1,606 మంది మృతి చెందారు. మహమ్మారి నుంచి తాజా 198 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు వైరస్ బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,91,510కి చేరింది.
రాష్ట్రంలో ప్రస్తుతం 1,985 కరోనా యాక్టివ్ కేసులుండగా.. 776 మంది బాధితులు హోం ఐసోలేషన్లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 30 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
- ఇదీ చూడండి :దేశంలో మరో 12,899 కరోనా కేసులు