కరోనా, బ్లాక్ ఫంగస్ వైద్యం ఉచితంగా అందించాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ దీక్షకు దిగారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ నేతలు దీక్షలు చేపట్టారు. గాంధీభవన్ వద్ద దీక్షకు దిగిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. అందరికీ కొవిడ్ టీకాలు ఉచితంగా వేయాలని డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారి వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా భయంకర పరిస్థితులను తలపిస్తోందని, ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారిందని విమర్శించారు.
Uttam : 'కరోనాతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఇబ్బందులు'
కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేసారు. కొవిడ్, బ్లాక్ ఫంగస్ వైద్యం ఉచితంగా అందించాలని కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ దీక్షకు దిగారు. గాంధీభవన్‌లో ఈ దీక్షలను ఉత్తమ్ ప్రారంభించారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి, కరోనా చికిత్సపై ఉత్తమ్ స్పందన
ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్క, జీవన్‌రెడ్డి, పొన్నాల, ఎంపీ కోమటిరెడ్డి, వంశీచంద్‌రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి పాల్గొన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ దీక్షలు కొనసాగనున్నాయి.
- ఇదీ చదవండి:దూరమవుతున్న బంధాలు.. వెంటాడుతున్న భయాలు
Last Updated : Jun 7, 2021, 11:54 AM IST