ఎన్నికల ప్రచారంలో భాజపా భాష సక్రమంగా లేకపోవడం వల్ల అనేక అనర్థాలు జరిగే అవకాశముందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ అన్న బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించారు. అందరూ కలిసిమెలిసి ఉండాలంటే బల్దియా ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటువేయాలని కోరారు.
తెలంగాణ ప్రశాంతతను భాజపా చెడగొడుతోంది: టీ కాంగ్రెస్ - congress incharge manikkam tagure
తెలంగాణలో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని భాజపా చెడగొడుతోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణికం ఠాగూర్ ఆరోపించారు. భిన్న సంస్కృతులకు నిలయమైన భాగ్యనగరంలో ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం సరికాదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెరాస-భాజపాల తీరును ఇద్దరు కాంగ్రెస్ నేతలు తప్పుబట్టారు.
తెలంగాణ ప్రశాంతతను భాజపా చెడగొడుతోంది
రాష్ట్రంలో ఉన్న ప్రశాంతతను చెడగొట్టేందుకు భాజపా ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ అన్నారు. మతవిద్వేషాలు రెచ్చగొడుతున్న బండి సంజయ్‌పై ఎందుకు కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. తెరాస-భాజపాల మధ్య స్నేహబంధం గల్లీ కుస్తీ-దిల్లీలో దోస్తీ మాదిరి ఉందని దుయ్యబట్టారు. విజయశాంతి ఇంకా కాంగ్రెస్‌లోనే ఉన్నారని స్పష్టం చేశారు.