తెలంగాణ

telangana

ETV Bharat / city

'కేసీఆర్​, కేటీఆర్ అసమర్థులనడానికి ఈ నివేదికే నిదర్శనం' - "కేసీఆర్​, కేటీఆర్ అసమర్థులనడానికి... సీఎస్ నివేదికే నిదర్శనం"

ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్​లు అసమర్థులనడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన నివేదికే నిదర్శనమని కాంగ్రెస్ నేత, పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ పాలనపై, ఆయా శాఖల పనితీరుపై సీఎస్‌ ఓ నివేదిక తయారు చేశారని, దీనితో సీఎం పనితీరు తేలిపోయిందని చెప్పారు.

"కేసీఆర్​, కేటీఆర్ అసమర్థులనడానికి... సీఎస్ నివేదికే నిదర్శనం"

By

Published : Sep 3, 2019, 2:05 PM IST

Updated : Sep 3, 2019, 2:42 PM IST

"కేసీఆర్​, కేటీఆర్ అసమర్థులనడానికి... సీఎస్ నివేదికే నిదర్శనం"

సీఎం కేసీఆర్ లక్షల కోట్లు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ముంచుతున్నారని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌, కేటీఆర్‌ కలిసి ప్రజలను మభ్యపెడుతున్నారని చెప్పారు. ప్రభుత్వ పాలనపై సీఎస్‌ నివేదికలో మొదటి మూడు స్థానాల్లో వీరి శాఖలు లేవని, మరి కేటీఆర్​కు అవార్డులెలా వస్తున్నాయని ప్రశ్నించారు. మాయమాటలు చెబుతూ, అమెరికా వెళ్లి అవార్డులు కొనుక్కుని వచ్చి తెలంగాణవాసులను మభ్య పెడుతున్నారని విమర్శించారు. ఆయా శాఖల వైఫల్యానికి సీఎం కూడా బాధ్యత వహించాలని అన్నారు. కాళేశ్వరంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. విద్యుత్ శాఖ గురించి గొప్పలు చెబుతున్నారని, కానీ సీఎస్ నివేదికలో ఆ శాఖకు 11వ ర్యాంకు ఇచ్చారని పేర్కొన్నారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఆయా శాఖలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Last Updated : Sep 3, 2019, 2:42 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details