తెలంగాణ

telangana

ETV Bharat / city

MLC elections Telangana congress : ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా? దూరంగా ఉండాలా? - hyderabad latest news

స్థానిక సంస్థ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై కాంగ్రెస్​ (MLC elections Telangana congress 2021) ఎటూ తేల్చుకోలేకపోతోంది. బరిలో అభ్యర్థులను నిలపాలా..? అసలు పోటీకే దూరంగా ఉండాలా అని సమాలోచనలు చేస్తోంది.

telangana congress
telangana congress

By

Published : Nov 21, 2021, 7:05 AM IST

స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసే విషయంపై కాంగ్రెస్‌ పార్టీ (MLC elections Telangana congress 2021)తర్జనభర్జన పడుతోంది. పోటీ చేయాలా? ఎన్నికలకు దూరంగా ఉండాలా? అనే దానిపై స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోతోంది.

దుబ్బాక, నాగార్జునసాగర్‌, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఓటముల ప్రభావం పార్టీపై పడిందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓడిపోతే పార్టీ శ్రేణులు, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని సీనియర్‌ నాయకులు కొందరు ఇప్పటికే అభిప్రాయం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరగనున్న (congress on mlc elections) జిల్లాలకు చెందిన సీనియర్‌ నాయకులు, డీసీసీ అధ్యక్షుల అభిప్రాయాలనూ సేకరించారు. నాలుగైదు రోజుల క్రితమే నిర్ణయం ప్రకటించాలని భావించినప్పటికీ.. ఎటూ తేల్చుకోలేక వాయిదా వేశారు.

తాజాగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (tpcc chief revanth reddy news) అధ్యక్షతన శనివారం గాంధీభవన్‌లో సీనియర్‌ నేతల సమావేశం జరిగింది. పార్టీ నేతలు జగ్గారెడ్డి, మహేష్‌కుమార్‌గౌడ్‌, మధుయాస్కీగౌడ్‌, దామోదర రాజనర్సింహా, చిన్నారెడ్డి, వివిధ జిల్లాల అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల్లోని స్థానిక సంస్థలో పార్టీకి ఉన్న బలాబలాలను విశ్లేషించారు.

అనంతరం దామోదర రాజనర్సింహా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఎన్నికల్లో పోటీచేయాలా? వద్దా? అనే విషయంపై ఇంకా కొంతమంది నాయకుల అభిప్రాయాలు తెలుసుకోవాల్సి ఉందని, అటు తర్వాత పీసీసీ నిర్ణయాన్ని ఏఐసీసీకి పంపిస్తామన్నారు. ధరణి, భూసమస్యల పరిశీలనకు దామోదర రాజనర్సింహా ఛైర్మన్‌గా, ఎం.కోదండరెడ్డి కన్వీనర్‌గా పీసీసీ కమిటీ ఏర్పాటుచేసినట్లు కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్ కుమార్‌ గౌడ్‌ తెలిపారు.

12 ఎమ్మెల్సీ స్థానాలకు...

స్థానిక సంస్థల కోటా(MLC elections Telangana congress 2021)లో 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా... తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 16 నామినేషన్లు ప్రారంభం కాగా 23 వరకు నామపత్రాలు స్వీకరణ ఉంటుంది. ఈ నెల 24న ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన చేయనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు 26 వరకు గడువును నిర్ణయించారు. డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహించగా... డిసెంబరు 14న ఓట్లను లెక్కిస్తారు. కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రెండేసి స్థానాలు ఉండగా... ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఒక్కో స్థానం ఉంది. మెదక్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానం ఖాళీగా ఉంది.

స్థానిక సంస్థల కోటా(local body mlc elections telangana 2021) నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన పురాణం సతీశ్ కుమార్, భానుప్రసాదరావు, నారదాసు లక్ష్మణరావు, భూపాల్ రెడ్డి, సుంకరి రాజు, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, కల్వకుంట్ల కవిత పదవీకాలం జనవరి నాలుగో తేదీతో పూర్తి కానుంది.

తొమ్మిది ఉమ్మడి జిల్లాల నుంచి..

హైదరాబాద్ మినహా మిగతా తొమ్మిది ఉమ్మడి జిల్లాల నుంచి వీరు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల నుంచి రెండు చొప్పున స్థానాలున్నాయి. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల నుంచి ఒక్కో స్థానం చొప్పున ఉన్నాయి. ఈ స్థానాల నుంచి జనవరి నాలుగో తేదీలోగా కొత్త వారిని ఎమ్మెల్సీలుగా ఎన్నుకోవాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details