T-Congress Leaders Meet Rahul Gandhi : ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇవాళ దిల్లీలో కలవనున్నారు. సాయంత్రం 4 గంటలకు తెలంగాణ నేతలు కలిసేందుకు రాహుల్ సమయం ఇచ్చారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి, మధు యాస్కీ, దామోదర రాజనర్సింహ, మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, అజారుద్దీన్, సీతక్క, బలరాం నాయక్ తదితర నేతలు రాహుల్‌ను కలవనున్నారు.
ఇవాళ రాహుల్ గాంధీని కలవనున్న కాంగ్రెస్ నేతలు - congress leaders meet rahul gandhi
T-Congress Leaders Meet Rahul Gandhi : రాష్ట్ర కాంగ్రెస్ నేతలు దిల్లీలో ఇవాళ రాహుల్ గాంధీని కలవనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పరిణామాలు, రాహుల్ సభపై ఈ భేటీలో చర్చించనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. డిజిటల్ సభ్యత్వ చెక్కును రాహుల్‌కు అందించనున్నారు.
T-Congress Leaders Meet Rahul Gandhi
డిజిటల్ సభ్యత్వ నమోదుకు సంబంధించిన చెక్కును తెలంగాణ నేతలు రాహుల్‌కు అందజేయనున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రంలో రాహుల్ సభ , ఇతర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి.