Congress On Job Notification: ఉద్యోగాల భర్తీ విషయంలో సీఎం కేసీఆర్ ప్రకటన తీవ్ర నిరాశకు గురిచేసిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018 ఎన్నికల సందర్భంగా నిరుద్యోగ భృతి ఇస్తామని అన్నారని.. ఆ సంగతి ఏమైందని ప్రశ్నించారు. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో అన్ని ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పారని.. బిస్వాల్ కమిటీ లక్షా 91వేల ఉద్యోగ ఖాళీలున్నాయని తెలిపిందన్నారు. ఇచ్చిన హామీకి అనుగుణంగా అన్ని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని.. అందుకే నిరుద్యోగ భృతి ఇవ్వలేదని చెప్పి.. కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రేపు సీఎంను కలుస్తా..
ఉద్యోగాల భర్తీ ప్రకటనపై వ్యక్తిగతంగా హర్షం వ్యక్తంచేస్తున్నానని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. సీఎంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. రేపు సీఎంను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరుతానని జగ్గారెడ్డి వెల్లడించారు. హౌసింగ్ విభాగాన్ని మళ్లీ తెరవాలని సీఎంకు విజ్ఞప్తి చేస్తానని చెప్పారు. బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం మిగతా పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో తమ పార్టీలో భిన్నాభిప్రాయాలు లేవని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
ఎన్నికల స్టంట్..