ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో తెరాస విఫలమైందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన.. సర్పంచ్ నిధులు, విధులు, హక్కుల కోసం రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నారు.
'కేంద్ర నిధులతో రాష్ట్ర పథకాలు అమలు చేయమంటే ఎలా' - Telangana congress leaders about panchayat funds
తెలంగాణ సర్కార్ స్థానిక సర్పంచులను నిర్ణయాలు తీసుకోనివ్వడం లేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. కేంద్ర నిధులతో రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయకుంటే సస్పెండ్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
సత్యాగ్రహ దీక్షలో కాంగ్రెస్ నేతలు
సర్పంచులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని వీహెచ్ డిమాండ్ చేశారు. గ్రామ ప్రజల మధ్య తగాదాలు పెట్టడమే గ్రామ స్వరాజ్యమా అని ప్రశ్నించారు. పంచాయతీ నిధులు పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు. దళారి చేతిలో ఈ ప్రభుత్వం నడుస్తుందని ఆక్షేపించారు. పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రతిష్ట కోసం అందరూ ఏకం కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్, వీహెచ్, పలువురు కాంగ్రెస్ నేతలు, సర్పంచులు పాల్గొన్నారు.