తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీపై కేఆర్​ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు.. ఆ రెండు ప్రాజెక్టులపై అభ్యంతరం.. - ప్రకాశం బ్యారేజీ

Telangana complains to KRMB about AP And Objection on those two projects
Telangana complains to KRMB about AP And Objection on those two projects

By

Published : Jul 5, 2022, 4:01 PM IST

Updated : Jul 5, 2022, 4:35 PM IST

15:58 July 05

ఏపీపై కేఆర్​ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు.. ఆ రెండు ప్రాజెక్టులపై అభ్యంతరం..

Telangana Letter to KRMB: ఏపీపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. ప్రకాశం బ్యారేజీ దిగువన 2 ఆనకట్టల నిర్మాణ ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు ఈఎన్‌సీ మురళీధర్ రెండు లేఖలు రాశారు. బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ప్రాజెక్టులు చేపట్టరాదని లేఖలో పేర్కొన్నారు. రెండు కొత్త బ్యారేజీల పనులు చేపట్టకుండా ఏపీని నిరోధించాలని కోరారు. కృష్ణా జలాలపై ఆధారపడి పంప్డ్‌ స్టోరేజ్ స్కీమ్‌ల ప్రతిపాదనపై మరో లేఖ రాశారు.

జలవిధానం మేరకు తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేఆర్​ఎంబీని తెలంగాణ కోరింది. తాగునీటి అవసరాలు కాదని ఇతరత్రాలకు తరలింపు సరికాదని అభ్యంతరం వ్యక్తం చేసింది. పంప్డ్‌ స్టోరేజ్ స్కీమ్‌, విద్యుదుత్పత్తికి నీటి తరలింపు సరికాదంది. అనుమతి లేని పంప్డ్‌ స్టోరేజ్ స్కీమ్‌లను పరిశీలించాలని తెలంగాణ కోరింది. సీడబ్ల్యూసీ, బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేని వాటిని పరిశీలించాలని కోరింది.

ఇవీ చూడండి:

Last Updated : Jul 5, 2022, 4:35 PM IST

ABOUT THE AUTHOR

...view details