Telangana commercial taxes revenue: మే నెలలో తెలంగాణ ప్రభుత్వానికి వాణిజ్యపన్నుల రాబడులు 52శాతం అధికంగా వచ్చాయి. గత నెలలో వచ్చిన వాణిజ్య పన్నుల రాబడిని కిందటేడాది మే నెలలో వచ్చిన రాబడితో పోల్చితే 52శాతం వృద్ధి నమోదైంది. 2021 మే లో 3,618.94 కోట్ల రూపాయల రాబడి రాగా.. 2022 మే నెలలో ఏకంగా రూ.5,498.19 కోట్లు ఆదాయం వచ్చింది. పెట్రోల్ అమ్మకాలపై వ్యాట్ ద్వారా రూ.1,308కోట్లు ఆదాయం రాగా... మద్యం అమ్మకాలపై వ్యాట్ ద్వారా రూ.1,247.38 కోట్లు.. జీఎస్టీ కింద రూ.2645.89 కోట్ల రాబడి వచ్చింది. 2021 మే నెలతో పోల్చితే పెట్రోల్‌పై వ్యాట్ ద్వారా ఆదాయం 34 శాతం, మద్యం అమ్మకాలపై వ్యాట్ రాబడి 28 శాతం, జీఎస్టీ ఆదాయంలో 59శాతం లెక్కన వృద్ధి నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లోనే సగటున రూ.11026.07 కోట్ల రాబడితో 33 శాతం అధికంగా రాబడులు వచ్చినట్లు తెలంగాణ వాణిజ్యపన్నుల శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన వాణిజ్య పన్నుల రాబడులు
తెలంగాణ ప్రభుత్వానికి వాణిజ్యపన్నుల రాబడులు మే నెలలో పెరిగాయి. గత నెలలో వచ్చిన వాణిజ్య పన్నుల రాబడిని కిందటేడాది మే నెలలో వచ్చిన రాబడితో పోల్చితే 52శాతం వృద్ధి నమోదైంది. 2021 మే లో 3,618.94 కోట్ల రూపాయల రాబడి రాగా.. 2022 మే నెలలో ఏకంగా రూ.5,498.19 కోట్లు ఆదాయం వచ్చింది.
రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన వాణిజ్య పన్నుల రాబడులు