KCR Yadadri Tour Cancelled : ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పర్యటన రద్దయింది. ఈ విషయాన్ని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. ఇవాళ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి తిరుకల్యాణ మహోత్సవానికి కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. సీఎం పర్యటన రద్దుతో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. యాదాద్రికి వెళ్లారు.
KCR Yadadri Visit Cancelled : కేసీఆర్ యాదాద్రి పర్యటన రద్దు - yadadri temple

09:50 March 11
కేసీఆర్ యాదాద్రి పర్యటన రద్దు
యాదాద్రీశుడి కల్యాణ మహోత్సవంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. స్వల్ప అస్వస్థత వల్ల కేసీఆర్ యాదాద్రి పర్యటనకు హాజరుకాలేకపోయినట్లు తెలుస్తోంది.
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తిరుకల్యాణ మహోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించింది. తితిదే అధికారులు యాదాద్రి ఈఓ గీతారెడ్డికి పట్టువస్త్రాలు అందించారు.
మార్చి 28న ప్రధానాలయం పునఃప్రారంభ నేపథ్యంలో కొనసాగుతున్న పనులు, మహా కుంభ సంప్రోక్షణ, అంకురార్పణపై అధికారులతో సీఎం సమీక్ష యథావిధిగా జరగనున్నట్లు సమాచారం. యాగాలు,హోమాలు, పూజలకు కావాల్సిన ఏర్పాట్లతో పాటు యాదాద్రికి వచ్చే భక్తులకు కల్పించే వసతులపై సీఎం కేసీఆర్ ఆరా తీయనున్నారు.