కరోనా నుంచి కోలుకున్న(post covid complications) అనంతరం ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న సీఎం కేసీఆర్ సతీమణి శోభ(kcr wife)కు శుక్రవారం దిల్లీలో వైద్యపరీక్షలు జరగనున్నాయి. దీని కోసం శోభ తనయుడైన మంత్రి కేటీఆర్(telangana minister KTR)తో శుక్రవారం ఉదయం దిల్లీకి వెళ్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. వైద్యనిపుణుడు, ఎయిమ్స్(Delhi AIMS) సంచాలకుడు రణదీప్ గులేరియా ఆమెకు పరీక్షలు నిర్వహించి చికిత్స అందించనున్నారు.
KCR wife Shobha : కేసీఆర్ సతీమణి శోభకు నేడు దిల్లీలో వైద్యపరీక్షలు.. వెంట వెళ్లనున్న కేటీఆర్ - కేసీఆర్ సతీమణి శోభకు దిల్లీలో వైద్య పరీక్షలు
కరోనా(post covid complications) నుంచి కోలుకున్న తర్వాత చాలా మందిలో అనారోగ్య సమస్యలు పీడిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి(cm kcr wife) కూడా కొవిడ్ బాధితురాలే. మహమ్మారి నుంచి కోలుకున్న ఆమె ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ సతీమణి శోభకు ఇవాళ దిల్లీలో వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు.
సీఎం కేసీఆర్(telangana cm kcr)తోపాటు శోభ(kcr wife)కు గతంలో కరోనా వచ్చి నయమైంది. ఆ తర్వాత ఆమెకు ఊపిరితిత్తుల సమస్య తలెత్తడంతో హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందారు. నయంకాక పోవడంతో వైద్యుల సలహాతో వైద్యనిపుణుడు రణదీప్ వద్దకు తీసుకెళ్లాలని సీఎం కేసీఆర్(telangana cm kcr) భావించారు. కానీ రాష్ట్రంలోని పరిణామాల దృష్ట్యా సీఎం సూచన మేరకు తన తల్లిని కేటీఆర్(telangana minister KTR) దిల్లీకి తీసుకువెళ్తున్నారు. వైద్యపరీక్షల అనంతరం శనివారం వారు హైదరాబాద్ వస్తారని తెలిసింది.
ఇవీ చదవండి :