రైతుల కోసం జగన్తో కలిసి పనిచేస్తాం: సీఎం కేసీఆర్ - kcr about jagan in assembly
ఉభయ రాష్ట్రాల రైతుల బాగుగోసం గోదావరి-కృష్ణా అనుసంధానానికి ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గోదావరిలో తను వేసినన్ని పైసలు ఎవరూ వేయలేదని పేర్కొన్నారు.
![రైతుల కోసం జగన్తో కలిసి పనిచేస్తాం: సీఎం కేసీఆర్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4446164-514-4446164-1568541125362.jpg)
'రైతుల కోసం జగన్తో కలిసి పనిచేస్తాం'
వివాదాలు పక్కన పెట్టి తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం ఏపీ సీఎం జగన్తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఏపీ నేతలు సహకరిస్తే గోదావరి-కృష్ణ నదుల అనుసంధానం పూర్తి చేస్తామని అన్నారు. దీనివల్ల ఇరు రాష్ట్రాల ప్రజలకు లాభదాయకంగా ఉంటుందని తెలిపారు. త్వరలోనే ఏపీ ఇంజినీర్లతో సమావేశం ఉంటుందని పేర్కొన్నారు.
'రైతుల కోసం జగన్తో కలిసి పనిచేస్తాం'
- ఇదీ చూడండి : యురేనియం తవ్వకాలకు అనుమతివ్వం: సీఎం కేసీఆర్