KCR reaction on lockdown: రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, ఆ శాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వ్యాప్తి తదితర అంశాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ఈనెల 8 నుంచి 16 వరకు సెలవులు ఇవ్వాలని ఆదేశించారు. ఉన్నత స్థాయిలో సమీక్షలో.. సీఎం కేసీఆర్‌కు వైద్యాధికారులు నివేదిక ఇచ్చారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా గుంపులుగా ఉండరాదని నివేదికలో పేర్కొన్నారు. బహిరంగ సభలు, ర్యాలీలు లేకుండా చర్యలు తీసుకోవాలని నివేదికలో కోరారు.
KCR reaction on lockdown: లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన - cm kcr on lockdown
21:07 January 03
రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు: సీఎం కేసీఆర్
లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్..
ప్రస్తుతం లాక్‌డౌన్ అక్కర్లేదని అధికారులు నివేదిక ఇచ్చారని చెప్పిన కేసీఆర్.. కరోనా దృష్ట్యా ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక వసతులు పటిష్టం చేయాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో పడకలు, పరీక్ష కిట్లు, మందులు సమకూర్చుకోవాలని స్పష్టం చేశారు. మిగతా నగరాల్లో బస్తీ దవాఖానాల ఏర్పాటుచేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రతిఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
ఇవీచూడండి:Telangana Covid Cases: మళ్లీ పెరుగుతున్న కేసులు... ఇవాళ 482 మందికి పాజిటివ్