రాష్ట్ర మంత్రులు, జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రగతిభవన్ వేదికగా... రెవెన్యూ, పంచాయతీరాజ్, పురపాలక, వైద్య-ఆరోగ్య, విద్యా, అటవీసహా ఇతర శాఖలకు సంబంధించిన అంశాలపై... సీఎం కేసీఆర్ కూలంకషంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
మంత్రులు, కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం - cm kcr meeting with district collectors
11:54 January 11
సీఎం భేటీలో టీకా పంపిణీతోపాటు పలు కీలక అంశాలపై చర్చ!
కరోనా కారణంగా మూతపడిన విద్యాసంస్థల ప్రారంభంపై ఈ భేటీలో దృష్టి సారించారు.
రెవెన్యూ శాఖకు సంబంధించిన అంశాలను సత్వరం పరిష్కరించేందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పెండింగ్ మ్యుటేషన్లు, సాదాబైనామాల క్రమబద్ధీకరణ, ట్రైబ్యునళ్ల ఏర్పాటు, పార్ట్-బిలో చేర్చిన భూముల పరిష్కారం తదితర విషయాలపై చర్చ జరిగింది. వారం రోజుల్లో ధరణి పోర్టల్లో మార్పులు చేర్పులు సరిచేయాలని ఆదేశించారు.
పల్లె, పట్టణ ప్రగతి పనుల పురోగతిపైనా సీఎం కేసీఆర్ సమీక్షించారు. హరితహారం కార్యక్రమం, గ్రామాల్లో, పట్టణాల్లో పచ్చదనం పెంపునకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు.
ఈనెల 16 నుంచి దేశవ్యాప్తంగా టీకా పంపిణీ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో వ్యాక్సిన్ సరఫరాకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.