తెలంగాణ

telangana

ETV Bharat / city

దేశంలో ప్రత్యామ్నాయంపై త్వరలోనే నిర్ణయం: కేసీఆర్‌ - cm kcr news

telangana cm kcr at ranchi
telangana cm kcr

By

Published : Mar 4, 2022, 3:55 PM IST

Updated : Mar 4, 2022, 10:56 PM IST

15:52 March 04

దేశంలో ప్రత్యామ్నాయంపై త్వరలోనే నిర్ణయం ఉంటుంది: కేసీఆర్‌

దేశంలో ప్రత్యామ్నాయంపై త్వరలోనే నిర్ణయం: కేసీఆర్‌

CM KCR With Jharkhand CM: దేశాన్ని సరైన దిశలో తీసుకెళ్లేందుకు చర్చలు మొదలయ్యాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. రాంచీలో.. ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరేన్‌తో కలిసి కేసీఆర్‌ మీడియా సమావేశం నిర్వహించారు. హేమంత్‌ సోరేన్‌తో జాతీయ రాజకీయాలపై చర్చించామని కేసీఆర్‌ వెల్లడించారు. స్వాతంత్ర్యం వచ్చి ఏళ్లు గడుస్తున్నా సరైన అభివృద్ధి జరగలేదన్న సీఎం.. దేశంలో మరింత మెరుగైన అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. దేశాభివృద్ధి కోసం ఏ మార్గాన్ని అనుసరించాలనే దానిపై ఆలోచిస్తున్నామని కేసీఆర్‌ చెప్పారు. దేశంలో ప్రత్యామ్నాయంపై త్వరలోనే నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.

'దేశాన్ని సరైన దిశలో నడిపించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. చర్చలు జరుగుతున్నాయి. ఇది భాజపా, కాంగ్రెస్‌ వ్యతిరేక కూటమి కాదు. ఇప్పటివరకు ఏ కూటమి ఏర్పడలేదు. ఏం జరగబోతుందో కాలం నిర్ణయిస్తుంది. కానీ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా తర్వాత ఎంత అభివృద్ధి జరగాలో అంత జరగలేదు. దేశం మెరుగైన అభివృద్ధి సాధించాలని కోరుతున్నా. దేశాభివృద్ధి కోసం ఏ మార్గాన్ని అనుసరించాలనే దానిపై ఆలోచనలు కొనసాగుతున్నాయి. అందులో మీ పాత్ర కూడా అవసరం.'

- కేసీఆర్‌, ముఖ్యమంత్రి

CM KCR On National Politics: దిల్లీ పర్యటన ముగించుకొని.. నేరుగా ఝార్ఖండ్‌ రాజధాని రాంచీకి సీఎం కేసీఆర్‌ చేరుకున్నారు. తొలుత గిరిజన ఉదయ నేత బిర్సా ముండా విగ్రహానికి కేసీఆర్‌ నివాళులు అర్పించారు. అనంతరం రాంచీలోని ఝార్ఖండ్ సీఎం అధికారిక నివాసానికి వెళ్లారు. కేసీఆర్ దంపతులు, ఎంపీ సంతోష్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ కవిత బృందాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ దంపతులు సాదరంగా ఆహ్వానించారు. శిబు సొరేన్​కు జ్ఞాపికను ముఖ్యమంత్రి కేసీఆర్ అందజేశారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఝార్ఘండ్ సీఎం హేమంత్ సొరేన్​తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు.

ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరేన్‌తో సమావేశం అనంతరం గల్వాన్ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ల కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్​ సాయం అందించారు. ఝార్ఖండ్​కు చెందిన ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున చెక్కులను అందించారు. అమర జవాన్‌ కుందన్‌కుమార్‌ ఓజా భార్య నమ్రతకు 10 లక్షల చెక్‌ను హేమంత్‌ సోరేన్‌తో కలిసి అందజేశారు. మరో వీర సైనికుడు గణేష్ కుటుంబసభ్యులకు 10లక్షల చెక్‌ను అందించారు.

ఇదీచూడండి:రాంచీలో కేసీఆర్ పర్యటన.. ఝార్ఖండ్​ ముఖ్యమంత్రితో భేటీ..

Last Updated : Mar 4, 2022, 10:56 PM IST

ABOUT THE AUTHOR

...view details