ముంబయిలో ముగిసిన సీఎం కేసీఆర్ పర్యటన
- శరద్‌పవార్ నివాసం నుంచి ముంబయి విమానాశ్రయానికి బయల్దేరిన సీఎం
- కాసేపట్లో హైదరాబాద్‌కు తిరుగుపయనం కానున్న సీఎం కేసీఆర్
18:26 February 20
ముంబయిలో ముగిసిన సీఎం కేసీఆర్ పర్యటన
18:14 February 20
శరద్‌పవార్‌తో ముగిసిన సీఎం కేసీఆర్ సమావేశం
16:46 February 20
శరద్ పవార్‌తో సమావేశమైన సీఎం కేసీఆర్
16:18 February 20
ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు జరుపుతాం
దేశ రాజకీయాలపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో చర్చించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. దేశంలో రావాల్సిన మార్పులపై చర్చించామన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై కూడా సమాలోచనలు చేసినట్లు పేర్కొన్నారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ, మహారాష్ట్ర సోదర రాష్ట్రాలు అని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య వెయ్యి కి.మీ. మేర ఉమ్మడి సరిహద్దు ఉందని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు మంచి అవగాహనతో ముందుకు నడవాల్సిన అవసరం ఉందని చెప్పారు. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా అనేక సమస్యలు ఉన్నాయని... ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన సమయమిదని సీఎం ఉద్ఘాటించారు.
ఇంకా అనేక ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు జరుపుతామని కేసీఆర్ ప్రకటించారు. కార్యాచరణ, చర్చలు ఇవాళే ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. కేంద్ర- రాష్ట్ర సంబంధాల్లో మార్పు జరగాలని అన్నారు. ఉద్ధవ్ ఠాక్రేను హైదరాబాద్‌కు రావాలని ఆహ్వానించినట్లు వెల్లడించారు.
జాతీయ రాజకీయాలపై కేసీఆర్‌తో చర్చించినట్లు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. దేశాభివృద్ధికి అవసరమైన కార్యాచరణపై చర్చించినట్లు పేర్కొన్నారు.
16:17 February 20
దేశ రాజకీయాల గురించి ఉద్ధవ్ ఠాక్రేతో చర్చించాను: కేసీఆర్