KCR Meeting With Ministers : కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచాలి: సీఎం కేసీఆర్ - ధాన్యం కొనుగోళ్లపై మంత్రులతో కేసీఆర్ భేటీ
13:45 March 25
KCR Meeting With Ministers : మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశం
KCR Meeting With Ministers : రాష్ట్ర మంత్రులతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ ముగిసింది. దిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్‌లో సీఎం సమావేశమయ్యారు. గురువారం రోజున దిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో చర్చల సారాంశాన్ని మంత్రులు కేసీఆర్‌కు వివరించారు. అనంతరం ధాన్యం కొనుగోళ్లపై కార్యాచరణ పట్ల చర్చించారు. ఏడు గంటలకు పైగా మంత్రులతో సీఎం సమావేశం కొనసాగింది.
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచాలని సీఎం పేర్కొన్నారు. క్షేత్రస్థాయి నుంచి తీర్మానాలు చేసి ప్రధానికి పంపాలని నిర్ణయించారు. తదుపరి కార్యాచరణపై రేపు ఉదయం నలుగురు మంత్రుల మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ఈ భేటీ తర్వాత సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయానికి వెళ్లనున్నారు. నూతన సచివాలయ నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. పనుల్లో పురోగతిపై అధికారులను ఆరా తీస్తారు.