KCR Meeting With Ministers : మంత్రులతో సీఎం కేసీఆర్ అత్యవసర భేటీ - CM KCR meets ministers
12:48 March 19
KCR Meeting With Ministers : ఫాంహౌస్‌లో మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశం
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో మంత్రులతో భేటీ అయ్యారు. పాలనాపరమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఈ భేటీలో మంత్రులతో పాటు సీఎస్ సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో నియామకాలు, వ్యవసాయం, ఇతర అంశాలపై కేసీఆర్ మంత్రులతో చర్చిస్తున్నారు. ఇటీవలే అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి ప్రకటించిన కేసీఆర్ ఏ శాఖలో ఎన్ని ఖాళీలున్నాయి? నోటిఫికేషన్‌కు ఎంత సమయం పడుతుంది? పరీక్షా తేదీలు వంటి కీలక విషయాల గురించి ఆ శాఖల మంత్రులు, అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు జీవో 111 రద్దు గురించి కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.
ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురైన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వారం రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. డాక్టర్ల సలహా మేరకు వారం పాటు పూర్తి విశ్రాంతి తీసుకున్న కేసీఆర్.. తిరిగి అధికారిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ మంత్రులతో ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లోనే సమావేశమయ్యారు.