రాష్ట్రంలో మే 29 వరకు లాక్డౌన్ కొనసాగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. 33 జిల్లాల్లో రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లాక్డౌన్ను ఎత్తివేస్తే కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. మే 29 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తమకు తామే స్వీయ నియంత్రణను పాటించాలని సూచించారు. కరోనా నియంత్రణకు ఉన్న ఒకే ఒక ఆయుధం లాక్డౌన్ అన్న సీఎం.. ప్రజలందరూ నిబంధనల పాటించాలని స్పష్టం చేశారు. 33 జిల్లాల్లో రాత్రి పూట కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు.