తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్ర కేబినెట్​ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ.. - night curfew in telangana

telangana cm holds cabinet meeting
kcr cabinet meeting

By

Published : Jan 17, 2022, 2:01 PM IST

Updated : Jan 17, 2022, 8:17 PM IST

13:41 January 17

రాష్ట్ర కేబినెట్​ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ..

రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులు, వ్యాప్తి నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గం చర్చిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్​లో కేబినెట్ సమావేశమైంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సమావేశంలో చర్చిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వైద్య-ఆరోగ్య శాఖ సన్నద్ధతను మంత్రి హరీశ్ రావు గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులో ఉందని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు అన్ని విధాలుగా శాఖ సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 5 కోట్ల కొవిడ్‌ టీకా డోసులు ఇచ్చినట్లు హరీశ్‌ రావు వెల్లడించారు. అర్హులైన వారందరికీ టీకాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు నిబంధనలు పాటిస్తే కరోనాను నియంత్రించవచ్చని స్పష్టం చేశారు. మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల సహకారం తీసుకోవాలని సీఎం కేసీఆర్​ సూచించారు. శాఖల సమన్వయంతో వాక్సినేషన్‌ను వేగవంతం చేయాలన్నారు. మంత్రులు, కలెక్టర్లు సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. మంత్రివర్గ భేటీ తర్వాత సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

మహిళా వర్సిటీ ఏర్పాటు

రాష్ట్రంలో మహిళా వర్సిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వర్సిటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించింది. అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్​ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే సిద్దిపేట జిల్లా ములుగులో ఎఫ్‌సీఆర్‌ఐ ఏర్పాటు చేశారు. ములుగులోని ఎఫ్‌సీఆర్‌ఐలో బీఎస్సీ ఫారెస్ట్రీ నాలుగేళ్ల కోర్సు ఉంది. బీఎస్సీ (ఫారెస్ట్రీ) కోర్సు చదివిన వారికి ప్రత్యేక రిజర్వేషన్లు ఇస్తున్నారు. అటవీశాఖ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కేబినెట్‌ నిర్ణయించింది. అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉద్యోగాల్లో 25 శాతం రిజర్వేషన్లు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విభాగంలో 50 శాతం రిజర్వేషన్లు, ఫారెస్టర్స్‌ ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్​ నిర్ణయించింది. రిజర్వేషన్లకు అనుకూలంగా సర్వీసు రూల్స్‌ సవరణకు కేబినెట్‌ గ్రీన్​ సిగ్నల్ ఇచ్చింది.

రేపు వరంగల్ టూర్​

అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్​ మంగళవారం పర్యటించనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఇతర ఉన్నతాధికారులు సీఎంతో పాటు పర్యటనలో పాల్గొననున్నారు.

Read also : TS High Court : రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలి: హైకోర్టు

Last Updated : Jan 17, 2022, 8:17 PM IST

ABOUT THE AUTHOR

...view details