తెలంగాణ

telangana

ETV Bharat / city

CLP Bhatti vikramarka: నీలకంఠాపురం దేవాలయ సందర్శనకు సీఎల్పీ నేత భట్టి - ex pcc chief raghuveera reddy

ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి.. ఆయన కుటుంబ సభ్యులు నిర్మించిన దేవాలయాలను సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తన సతీమణితో కలిసి సందర్శించారు. అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. స్వామివార్లను దర్శించుకున్నారు. భట్టికి శాలువా కప్పి పూలమాలతో రఘువీరా సన్మానించారు.

telangana-clp-leader-batti-vikramaraka-visited-neelakantapuram-temples
telangana-clp-leader-batti-vikramaraka-visited-neelakantapuram-temples

By

Published : Aug 28, 2021, 8:08 PM IST

నీలకంఠాపురం దేవాలయ సందర్శనకు సీఎల్పీ నేత భట్టి

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో ఆ రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు నూతనంగా నిర్మించిన దేవాలయాలను.. తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆయన సతీమణితో కలిసి దర్శించారు.

గ్రామానికి చేరుకున్న భట్టి దంపతులను రఘువీరారెడ్డి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. అక్కడి ఆలయాల విశిష్టతను వివరించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం వారికి రఘువీరా శాలువా కప్పి పూలమాలతో సన్మానించారు. అనంతరం దేవాలయ కట్టడాల ప్రత్యేకతను ప్రాముఖ్యతను భట్టి దంపతులకు రఘువీరా వివరించారు.

ABOUT THE AUTHOR

...view details