రాష్ట్రంలో కొత్తగా 805 కరోనా కేసులు, 4 మరణాలు - corona virus death toll in telangana
![రాష్ట్రంలో కొత్తగా 805 కరోనా కేసులు, 4 మరణాలు Telangana COVID-19](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9701203-1009-9701203-1606619130125.jpg)
08:15 November 29
రాష్ట్రంలో కొత్తగా 805 కరోనా కేసులు, 4 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 805 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2,69,223కు పెరిగింది. తాజాగా 948 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకూ 2,57,278 మంది ఆరోగ్యవంతులుగా కోలుకున్నారు. మరో నలుగురు మృతి చెందారు. మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,455కి చేరుకుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 10,490 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 8,367 మంది బాధితులున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 131 కేసులు నమోదవగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 82, రంగారెడ్డిలో 58 కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి :గ్రేటర్ పోరు: వర్గాల వారీ రాయబేరాలు!