తెలంగాణలో కొత్తగా 253 కరోనా కేసులు, 3 మరణాలు - corona virus death toll in telangana
09:50 January 05
తెలంగాణలో కొత్తగా 253 కరోనా కేసులు, 3 మరణాలు
రాష్ట్రంలో 253 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,87,993కి చేరింది. ఈ మహమ్మారితో మరో ముగ్గురు మృతి చెందారు. మృతుల సంఖ్య 1,554కి చేరింది. నిన్న రాత్రి 8గంటల వరకు 42,485 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కరోనాబారి నుంచి 317 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 2,81,400 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 5,039 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 2,793 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 70,61,049కి చేరింది.
ఇదీ చదవండి :మరోవారంలో రాష్ట్రానికి టీకా... తొలుత 10 లక్షల డోసులు