ఉద్యోగుల పదోన్నతులను ఎలాంటి జాప్యం లేకుండా ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని అన్ని శాఖ కార్యదర్శులు, ఉన్నతాధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సచివాలయంలో సమావేశమైన సీఎస్.. పదోన్నతులు, నియామకాల అంశంపై చర్చించారు. సచివాలయం, శాఖాధిపతులు, జిల్లా స్థాయిలో పదోన్నతుల ప్రక్రియలో ఎలాంటి జాప్యం తగదని స్పష్టం చేశారు.
త్వరలోనే ఉద్యోగోన్నతులు... సీఎస్ ఆదేశాలు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు త్వరలోనే ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ఈ నెలాఖరు వరకు ప్రక్రియ పూర్తి చేయాలని అన్ని శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులను ఆదేశించారు.
త్వరలోనే ఉద్యోగుల పదోన్నతులు
కారుణ్య నియామకాల ప్రక్రియను కూడా ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని సోమేశ్ కుమార్ తెలిపారు. పదోన్నతులు ఇవ్వడం ద్వారా ఏర్పడే ఖాళీలను కూడా ప్రత్యక్ష నియామకాల నోటిఫికేషన్లలో చేర్చాలని ఆదేశించారు. పదోన్నతులు, కారుణ్య నియామకాలు, ప్రత్యక్ష నియామకాల పోస్టుల భర్తీ అంశాలపై ఈ నెల 6, 20, 27 తేదీల్లో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.
- ఇదీ చూడండి :జనవరిలోనే పదోన్నతులు, వేతన సవరణ: సీఎం కేసీఆర్