ప్రగతిభవన్‌లో ముగిసిన కేసీఆర్, జగన్ భేటీ - ఏపీ ముఖ్యమంత్రి
హైదరాబాద్ ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్రెడ్డి సమావేశం ముగిసింది. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీలో గోదావరి జలాల మళ్లింపు, విభజన అంశాలపై ప్రధానంగా చర్చించారు.
ప్రగతిభవన్‌లో ముగిసిన కేసీఆర్, జగన్‌ల భేటీ
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్రెడ్డితో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ ముగిసింది. దాదాపు మూడు గంటలపైగా జరిగిన సమావేశంలో విభజన సమస్యలు, తెలుగు రాష్ట్రాల నీటి సమస్యలపై చర్చించారు. త్వరలోనే తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమావేశం కానున్న నేపథ్యంలో ఇరువురి ముఖ్యమంత్రుల మధ్య భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్‌ను కలిసేముందు రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు.
- ఇదీ చూడండి : 2 నెలల పాటు సాధారణ వర్షపాతం: ఐఎమ్‌డీ
Last Updated : Aug 1, 2019, 6:00 PM IST