రేపు రాత్రి 7 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం - తెలంగాణ తాజా వార్తలు
16:41 March 16
రేపు రాత్రి 7 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
రాష్ట్ర మంత్రివర్గం రేపు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో రేపు సాయంత్రం ఏడు గంటలకు కేబినెట్ భేటీ అవుతుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఈ నెల 18న ఉభయసభల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌కు రేపు సాయంత్రం మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది.
కేబినెట్ చివరి సారిగా నవంబర్ 13న సమావేశమైంది. ఆ తర్వాత మంత్రివర్గం మళ్లీ ఇప్పుడు సమావేశం అవుతోంది. బడ్జెట్‌కు ఆమోదంతో పాటు ఇతర అంశాలపై కూడా కేబినెట్లో చర్చిస్తారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యుహంపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేస్తారు. ఇతర పాలనాపర, రాజకీయ అంశాలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.
ఇవీచూడండి:డీఎఫ్ఐ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఓకే