విస్తరణ తర్వాత ప్రగతిభవన్‌లో పుర్తిస్థాయి మంత్రివర్గ సమావేశమైంది. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సోమవారం ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి బడ్జెట్‌పై చర్చించారు. నూతన అసెంబ్లీ, సచివాలయ నిర్మాణం, పురపాలక ఆర్డినెన్స్ స్థానంలో కొత్త చట్టం కోసం బిల్లుపై చర్చలు జరిపినట్లు తెలిసింది. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కొత్త సచివాలయ నిర్మాణానికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికపై చర్చించినట్లు సమాచారం. వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లోకి మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.
ప్రగతిభవన్‌లో మంత్రివర్గ సమావేశం
ప్రగతిభవన్‌లో మంత్రివర్గ సమావేశం
19:00 September 08
తొలిసారి పూర్తిస్థాయి మంత్రివర్గ భేటీ
Last Updated : Sep 8, 2019, 8:00 PM IST