ప్రగతిభవన్ వేదికగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన భేటీ అయిన మంత్రి వర్గ సమావేశం మూడు గంటల పాటు జరిగింది. ధాన్యం కొనుగోళ్లే ప్రధాన అజెండాగా మంత్రివర్గ సమావేశమైంది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్రంలో నెలకొన్న అయోమయ పరిస్థితుల నేపథ్యంలో సమావేశమైన కేబినెట్.. ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకునే అంశంపై చర్చించింది. దీంతో పాటు సమావేశంలో చెన్నూరు ఎత్తిపోతల పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
చెన్నూరు ఎత్తిపోతలకు కేబినెట్ ఆమోదం.. 1658 కోట్లు మంజూరు
14:06 April 12
సుదీర్ఘంగా సాగిన మంత్రి వర్గ సమావేశం..
చెన్నూరు ఎత్తిపోతల పథకం కోసం రూ.1658 కోట్లు మంజూరు చేసింది. చెన్నూరు నియోజకవర్గంలోని 5 మండలాల్లోని 103 గ్రామాలకు సాగు, తాగు నీటిని ఈ పథకం ద్వారా అందించనున్నారు. 10 టీఎంసీల గోదావరి నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఈ పథకానికి వినియోగించనున్నారు. పార్వతీ బ్యారేజ్ జలాశయం నుంచి జైపూర్, మందమర్రి మండలాల్లో 25 వేల 423 ఎకరాలకు.. సరస్వతి బ్యారేజ్ జలాశయం నుంచి చెన్నూరు, భీమారం, కోటపల్లి మండలాల్లో 48 వేల 208 ఎకరాలకు... లక్ష్మీబ్యారేజీ జలాశయం నుంచి కోటపల్లి మండలంలోని 16 వేల 370 ఎకరాలకు మొత్తంగా 90 వేల ఎకరాలకు ఈ పథకం ద్వారా సాగునీరు అందనుంది.
ధాన్యం కొనుగోలు అంశంపై సమావేశంలో చర్చించారు. గత కొంత కాలంగా ఈ విషయంలో కేంద్రానికి రాష్ట్రానికి మధ్య రాజకీయ దుమారమే చెలరేగింది. రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపిస్తోన్న తెరాస.. వివిధ రూపాల్లో నిరసన తెలిపింది. చివరికి దిల్లీలోనూ.. ముఖ్యమంత్రి సహా గులాబీ నాయకులంతా నిరసన దీక్ష చేశారు. రాష్ట్రంలో పండించిన ప్రతీ గింజను కేంద్రమే కొనాలని.. ధాన్యం సేకరణలో దేశమంతా ఒకే విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
మరోవైపు.. దేశమంతా ఒకే విధానం అమలు చేస్తున్నామని.. తెలంగాణపై ఎలాంటి వివక్ష లేదని కేంద్రం చెబుతోంది. ముందు జరిగిన ఒప్పందం ప్రకారమే ధాన్యం సేకరిస్తున్నామని స్పష్టం చేస్తోంది. ఉప్పుడు బియ్యాన్ని సేకరించే పరిస్థితి లేదని.. రా రైస్ ఎంతైన తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని పదేపదే ఉద్ఘాటిస్తోంది.
ఇదీ చూడండి: