రాష్ట్ర కేబినెట్ భేటీ... లాక్‌డౌన్ సడలింపులపై చర్చ! - కరోనాపై తెలంగాణ మంత్రివర్గ సమావేశం
17:11 May 18
రాష్ట్ర కేబినెట్ భేటీ... లాక్‌డౌన్ సడలింపులపై చర్చ!
కరోనా కట్టడి, లాక్‌డౌన్‌కు సంబంధించి.. రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసులు, ఇప్పటి వరకు చేపట్టిన నిరోధక చర్యలు, లాక్‌డౌన్‌కు సంబంధించి... కేంద్రం ఇచ్చిన సడలింపులు, రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం కేసీఆర్... మంత్రుల అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
కేంద్రం నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చిస్తున్నట్టు సమాచారం. రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుండగా ఆ విషయంలో ఏ విధంగా నిర్వహించాలనే అంశంపై... కేసీఆర్ చర్చిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులతో ఇవాళ మధ్యాహ్నమే సమీక్షించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్... సీఎం కేసీఆర్కు వివరణ ఇచ్చారు.