కరోనా నేపథ్యంలో బయట తిరగలేని పరిస్థితుల్లో ప్రజలకు వస్తుసేవలు అందుబాటులోకి రావడానికి లాజిస్టిక్స్ రంగం ఎంతగానో ఉపయోగపడిందని కేబినెట్ గుర్తించింది. అంతర్జాతీయ ఈ-కామర్స్ సంస్థలు లాజిస్టిక్ రంగాన్ని వినియోగించుకుని.. ప్రపంచ వ్యాప్తంగా సేవలందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక వ్యవసాయ అభివృద్ధిలో ఆయా ఉత్పత్తులను దేశవిదేశీ వినియోగదారుల చెంతకు చేర్చడానికి లాజిస్టిక్స్ రంగాన్ని ప్రోత్సహించడం తక్షణావసరమని కేబినెట్ అభిప్రాయపడింది. వ్యవసాయ రంగంలో సాధించిన అభివృద్ధి తద్వారా ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా సాధించే అదనపు వాణిజ్యానికి లాజిస్టిక్ రంగాభివృద్ధి ఎంతో అవసరమని ప్రభుత్వం పేర్కొంది.
1400 ఎకరాల్లో డ్రై పోర్టు..
రాష్ట్రంలో గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు, డ్రై పోర్టులు, ట్రక్ డాక్ పార్కింగ్ సహా తదితర లాజిస్టిక్స్ రంగాల్లో మౌలిక వసతులను మెరుగు పరచాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో సుమారుగా 1400 ఎకరాల్లో భారీ స్థాయిలో డ్రై పోర్టును(మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కును) పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేయాలని మంత్రవర్గం నిర్ణయించింది.
మరో 10 ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్కులు..