తెలంగాణ

telangana

ETV Bharat / city

శాసనసభ శనివారానికి వాయిదా - తెలంగాణ బడ్జెట్ 2021 వివరాలు

harish rao
harish rao

By

Published : Mar 18, 2021, 10:44 AM IST

Updated : Mar 18, 2021, 2:10 PM IST

12:31 March 18

2020-21 బడ్జెట్‌ను సవరించిన ప్రభుత్వం

  • రూ.1.82 లక్షల కోట్ల నుంచి రూ.1.66 లక్షల కోట్లకు సవరణ
  • 2020-21 బడ్జెట్ అంచనాలతో పోలిస్తే పెరిగిన ప్రతిపాదనలు
  • రూ.47,911.54 కోట్ల మేర పెరిగిన ప్రతిపాదనలు
  • గత బడ్జెట్‌తో పోలిస్తే 26.19 శాతం పెరిగిన ప్రతిపాదనలు
  • 2021-22 ముగిసే నాటికి మొత్తం అప్పు రూ.2,86,804.64 కోట్లు
  • జీఎస్‌డీపీలో అప్పుల శాతం 24.84

12:21 March 18

రూ.2,30,825.96 కోట్లతో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ రూపుదిద్దుకుంది. రూ.1,69,383.44 కోట్లు రెవెన్యూ వ్యయంగా లెక్కతేల్చారు. రూ.45,509.6 కోట్లు ఆర్థిక లోటుగా అంచనా వేశారు. 29 వేల రూ.46.77 కోట్లు పెట్టుబడి వ్యయాలకు కేటాయించారు. రూ.6,743.50 కోట్లు రెవెన్యూ మిగులు ఉంటుందని అంచనా వేశారు. 

శాఖల వారిగా కేటాయింపులను పరిశీలిస్తే.. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. రూ.29,271 కోట్లు కేటాయించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద రూ.5 కోట్ల చొప్పున కేటాయిస్తూ వార్షిక పద్దులో రూ.800 కోట్లు లెక్కచూపించారు. ఈసారి దళితుల కోసం 'సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌' ప్రత్యేక పథకం ప్రకటించిన ప్రభుత్వం వెయ్యి కోట్లు కేటాయించింది.

12:05 March 18

ఈ ఏడాది రూ.47,500 కోట్ల రుణాలు తీసుకోవాలని ప్రతిపాదన: హరీశ్‌రావు

  • పన్నుల ఆదాయం అంచనా - రూ.92,910 కోట్లు
  • పన్నేతర ఆదాయం - రూ.30,557.35 కోట్లు
  • గ్రాంట్ల అంచనా - రూ.38,669.46 కోట్లు
  • కేంద్ర పన్నుల్లో వాటా - రూ.13,990.13 కోట్లు
  • స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం అంచనా - రూ.12,500 కోట్లు
  • ఎక్సైజ్‌ ఆదాయం అంచనా - రూ.17 వేల కోట్లు
  • అమ్మకం పన్ను ఆదాయం అంచనా - రూ.26,500 కోట్లు
  • వాహనాల పన్ను - రూ.5 వేల కోట్లు
  • 15వ ఆర్థిక సంఘం స్థానిక సంస్థలకు విడుదల చేసే నిధుల్లో రాష్ట్రానికి రూ.699 కోట్లు కోత
  • తొలిసారిగా జిల్లా, మండల పరిషత్‌లకు బడ్జెట్‌లో నిధులు
  • మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌లు - రూ.500 కోట్లు

11:42 March 18

  • రాష్ట్ర బడ్జెట్‌ - రూ.2,30,825.96 కోట్లు
  • రెవెన్యూ వ్యయం - రూ.1,69,383.44 కోట్లు
  • ఆర్థిక లోటు అంచనా - రూ.45,509.60 కోట్లు
  • పెట్టుబడి వ్యయం - రూ.29,046.77 కోట్లు
  • రెవెన్యూ మిగులు - రూ.6,743.50 కోట్లు
  • పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ – రూ.29,271 కోట్లు
  • ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రూ.5 కోట్ల నియోజక అభివృద్ధి నిధులు
  • ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మొత్తం రూ.800 కోట్లు
  • షెడ్యూల్‌ కూలాల అభివృద్ధికి కొత్తగా దళిత్‌ సాధికారత పథకం
  • సీఎం దళిత్‌ సాధికారత పథకం - రూ.వెయ్యి కోట్లు
  • వ్యవసాయ యాంత్రీకరణ – రూ.1500 కోట్లు
  • రైతు బంధు - రూ.14,800 కోట్లు
  • రుణమాఫీ - రూ.5,225 కోట్లు
  • వ్యవసాయశాఖ – రూ.25 వేల కోట్లు
  • పశుసంవర్ధకశాఖ – రూ.1,730 కోట్లు
  • నీటిపారుదలశాఖ – రూ.16,931 కోట్లు
  • సమగ్ర భూసర్వే - రూ.400 కోట్లు
  • ఆసరా పింఛన్లు - రూ.11,728 కోట్లు
  • కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ - రూ.2,750 కోట్లు
  • ఎస్సీ ప్రత్యేక ప్రగతి నిధి - రూ.21,306.85 కోట్లు
  • ఎస్టీల ప్రత్యేక ప్రగతి నిధి - రూ.12,304.23 కోట్లు
  • ఎస్టీ గృహాలకు రాయితీపై విద్యుత్‌ - రూ.18 కోట్లు
  • 3 లక్షల గొర్రెల యూనిట్లు - రూ.3 వేల కోట్లు
  • బీసీలకు కల్యాణలక్ష్మికి అదనంగా- రూ.500 కోట్లు
  • నేతన్నల సంక్షేమం - రూ.338 కోట్లు
  • ఎంబీసీ కార్పొరేషన్‌ - రూ.వెయ్యి కోట్లు
  • బీసీ సంక్షేమశాఖ – రూ.5,522 కోట్లు
  • మైనార్టీ సంక్షేమశాఖ - రూ.1,606 కోట్లు
  • మహిళలకు వడ్డీలేని రుణాలు - రూ.3 వేల కోట్లు
  • మహిళా శిశు సంక్షేమశాఖ - రూ.1,702 కోట్లు

  •  
  • సొంత స్థలం కలిగిన పేదలకు 2 పడక గదుల ఇళ్ల హామీ అమలుకు త్వరలో విధి విధానాలు
  • రెండు పడక గదుల ఇళ్లు - రూ.11 వేల కోట్లు
  • పట్టణాల్లో సమీకృత మార్కెట్లు - రూ.500 కోట్లు
  • పట్టణాల్లో వైకుంఠధామాలు - రూ.200 కోట్లు
  • పురపాలకశాఖ – రూ.15,030 కోట్లు
  • హైదరాబాద్‌ తాగునీటి ప్రాజెక్టుకు రూ.725 కోట్లు
  • మూసీ పునరుజ్జీవం - రూ.200 కోట్లు
  • మెట్రో రైలు - రూ.వెయ్యి కోట్లు
  • ఓఆర్‌ఆర్‌ లోపల కొత్త కాలనీల్లో తాగునీరు-రూ.250 కోట్లు
  • వరంగల్‌ కార్పొరేషన్‌ - రూ.250 కోట్లు
  • ఖమ్మం కార్పొరేషన్‌ - రూ.150 కోట్లు
  • వైద్యారోగ్యశాఖ – రూ.6,295 కోట్లు
  • విద్యారంగ అభివృద్ధికి నూతన పథకం
  • రెండేళ్లలో రూ.4 వేల కోట్లతో విద్యా పథకం
  • అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పెద్దఎత్తున మౌలిక వసతుల సౌకర్యం
  • బృహత్తర విద్యా పథకం కోసం ఈ ఏడాది రూ.2 వేల కోట్లు
  • పాఠశాల విద్య – రూ.11,735 కోట్లు
  • ఉన్నత విద్య – రూ.1,873 కోట్లు
  • విద్యుత్‌శాఖ – రూ.11,046 కోట్లు
  • పరిశ్రమల రాయితీలు - రూ.2500 కోట్లు
  • పరిశ్రమలశాఖ – రూ.3,077 కోట్లు
  • ఐటీ రంగం - రూ.360 కోట్లు
  • ఈ ఏడాది ఆర్టీసీకి రూ.3 వేల కోట్లు
  • ఆర్టీసీకి బడ్జెట్‌ ద్వారా రూ.1500 కోట్లు
  • బడ్జెటేతర రూపంలో మరో రూ.1500 కోట్లు
  • అటవీశాఖ – రూ.1,276 కోట్లు
  • దేవాదాయశాఖ – రూ.720 కోట్లు
  • ఆర్‌ అండ్‌ బీ రోడ్ల మరమ్మతు - రూ.800 కోట్లు
  • పంచాయతీరాజ్‌ రోడ్ల మరమ్మతు - రూ.300 కోట్లు
  • పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, పోలీసు కార్యాలయాలు - రూ.725 కోట్లు
  • కొత్త సచివాలయం - రూ.610 కోట్లు
  • ఆర్‌వోబీలు, ఆర్‌యూబీలు - రూ.400 కోట్లు
  • ఆర్‌ అండ్‌ బీ - రూ.8,788 కోట్లు
  • రీజినల్‌ రింగ్‌ రోడ్డు భూసేకరణ – రూ.750 కోట్లు
  • ద్వితీయశ్రేణి నగరాల్లో ఎయిర్‌స్ట్రిప్‌ల అభివృద్ధి - రూ.100 కోట్లు
  • హోంశాఖ – రూ.6,465 కోట్లు
  • పౌరసరఫరాలశాఖ – రూ.2,363 కోట్లు
  • సాంస్కృతిక, పర్యాటక రంగాలు - రూ.726 కోట్లు

11:34 March 18

అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న మంత్రి హరీశ్‌రావు

  • గురుతర బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు: హరీశ్‌రావు
  • ఏడేళ్ల తెలంగాణ అనేక రాష్ట్రాలను ప్రగతిలో అధిగమించింది: హరీశ్‌రావు
  • ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేరుస్తుంది: హరీశ్‌రావు
  • నిర్దేశిత లక్ష్యాలను నిర్దిష్ట సమయంలో పూర్తి చేస్తున్నాం: హరీశ్‌రావు
  • సమస్యలు,సవాళ్లు అధిగమిస్తూ ప్రగతిపథాన పయనిస్తున్నాం: హరీశ్‌రావు
  • కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది: హరీశ్‌రావు
  • రాష్ట్రంలోనూ కరోనా తీవ్ర ప్రభావం చూపింది: హరీశ్‌రావు
  • రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా సీఎం శ్రమించారు: హరీశ్‌రావు

11:23 March 18

అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న మంత్రి హరీశ్‌రావు

మండలిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి

10:35 March 18

సభాపతి పోచారం, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి బడ్జెట్ ప్రతి అందజేత

సభాపతి పోచారం, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి బడ్జెట్ ప్రతి అందజేత

బడ్జెట్‌ ప్రతి అందజేసిన మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్ రెడ్డి

10:35 March 18

ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకునేలా బడ్జెట్‌ రూపకల్పన: హరీశ్‌రావు

ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేలా బడ్జెట్‌ రూపకల్పన చేశామని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. కాసేపట్లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నమంత్రి హరీశ్‌రావు.. జూబ్లీహిల్స్ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వెంకటేశ్వర స్వామి తెలంగాణకు తరలివచ్చినంత సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి  కేసీఆర్​ఆలోచనలకు అనుగుణంగా బడ్జెట్‌ ఉంటుందని హరీశ్‌ స్పష్టం చేశారు.

10:30 March 18

కాసేపట్లో ఉభయసభల్లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

కాసేపట్లో 2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ఉభయసభల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఉదయం 11.30 కి ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బుధవారం రాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం... వార్షికపద్దుకు ఆమోదముద్ర వేసింది. 

వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆశావహ దృక్పథంతోనే బడ్జెట్ రూపుదిద్దుకొంది. కరోనా కష్టకాలం ఆ తర్వాత క్రమేణా వివిధ రంగాలు పుంజుకున్న నేపథ్యంలో బడ్జెట్ ఆశాజనకంగానే ఉంటుందని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. కరోనా కారణంగా మొదట్లో రాబడులు, ఆదాయం భారీగా తగ్గినప్పటికీ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి బాగా పెరిగాయి. చివర్లో పెరిగిన అంచనాల ఆధారంగానే 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధమైనట్లు సమాచారం.

Last Updated : Mar 18, 2021, 2:10 PM IST

ABOUT THE AUTHOR

...view details