విజయవాడ కనకదుర్గమ్మకు మహంకాళి ఆలయం తరఫున... బంగారు పాత్రలో బోనం వండి పాతబస్తీ భక్తులు అమ్మవారికి సమర్పించారు. సప్త మాతృకలకు సప్త బంగారు బోనాలు సమర్పణలో భాగంగా దుర్గమ్మకు బోనం సమర్పించినట్లు భక్తులు తెలిపారు.
బెజవాడ దుర్గమ్మకు తెలంగాణ బోనం - విజయవాడ దుర్గమ్మకు తెలంగాణ నుంచి బోనం
విజయవాడలోని కనకదుర్గ అమ్మవారికి తెలంగాణ నుంచి బోనం సమర్పించారు. హైదరాబాద్లోని మహంకాళి ఆలయం తరఫున... బంగారు పాత్రలో బోనం వండి పాతబస్తీ భక్తులు అమ్మవారికి సమర్పించారు.

బెజవాడ దుర్గమ్మకు తెలంగాణ బోనం
కరోనా నిబంధనల మేరకు అధికారులు పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతించారు. కార్యక్రమంలో దుర్గగుడి ఈవో, భాగ్యనగర్ మహంకాళీ బోనాల ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఇవీచూడండి:ఆయన్ను స్మరించుకుంటే మన భాషను గుర్తుచేసుకున్నట్టే: దత్తాత్రేయ