భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి ఎన్నిక కీలక దశకు చేరుకుంది. ఈ నెలాఖరు వరకు జాతీయ నాయకత్వం నూతన సారథిని ప్రకటించే అవకాశం ఉంది. అధ్యక్షుడి ఎంపికపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ జైన్... ముఖ్యనేతలు, కోర్ కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల నేతల నుంచి ఇవాళ అభిప్రాయాలు సేకరించారు.
తుది దశకు చేరుకున్న తెలంగాణ కమల దళపతి ఎంపిక..! - telangana bjp new president
తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడి ఎంపికపై ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ జైన్ అభిప్రాయాలు సేకరించారు. లక్ష్మణ్‌నే కొనసాగించాలని చాలా మంది అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి నెలాఖరు వరకు నూతన దళపతిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమచారం.
తుది దశకు తెలంగాణ కాషాయ దళపతి ఎంపిక
అభిప్రాయాలు సేకరించిన అనంతరం అనిల్ జైన్ దిల్లీకి పయనమయ్యారు. అందరి అభిప్రాయాలపై నివేదిక రూపొందించి జాతీయ నాయకత్వానికి అందించనున్నారు. ఆర్ఎస్ఎస్ మినహా... ఎక్కువ మంది లక్ష్మణ్‌నే కొనసాగించాలని కోరినట్లు జైన్ సర్వేలోనూ వెల్లడైంది. అభిప్రాయాలన్నింటిని సమగ్రంగా పరిశీలించిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిని ఈ నెలాఖరుకు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమచారం.
ఇదీ చూడండి:ట్రంప్‌తో దావత్ కోసం రేపు దిల్లీకి సీఎం కేసీఆర్