Bandi Sanjay News : భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆ పార్టీ జిల్లా అధ్యక్షులతో సమావేశమయ్యారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలు మినహా మిగతా జిల్లాల అధ్యక్షులు, ఇంఛార్జీలు హాజరయ్యారు. జిల్లాల్లో పార్టీ సంస్థాగత బలోపేతం, తెరాస వైఫల్యాలపై పోరాటం చేసే అంశాలపై దిశా నిర్ధేశం చేశారు.
Bandi Sanjay News : జిల్లా అధ్యక్షులతో బండి సంజయ్ భేటీ - బండి సంజయ్ వార్తలు
Bandi Sanjay News : భాజపా జిల్లా అధ్యక్షులతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశమయ్యారు. రాష్ట్రంలోని జిల్లాల్లో పార్టీ సంస్థాగత బలోపేతం, తెరాస వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం.. కేసీఆర్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం వంటి పలు అంశాలపై నాయకులకు బండి దిశా నిర్దేశం చేశారు.
Bandi Sanjay News
ఈ భేటీలో పార్టీ ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, బంగారు శ్రుతి తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులంతా క్షేత్రస్థాయిలో తెరాస వైఫల్యాలను ఎండగట్టాలని.. కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని జిల్లా నాయకులకు బండి దిశా నిర్దేశం చేశారు.