ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండగ సమ్మక్క, సారలమ్మ జాతరకు సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడికి వెళ్లినా పండగలకు వంద కోట్లు ప్రకటిస్తారు తప్పితే ఖర్చు చేసిన దాఖలాలులేవని ఎద్దేవా చేశారు. జాతర సమయంలో ములుగు జిల్లా కలెక్టర్లను నలుగురిని మార్చడం వెనక ఉన్న మర్మమేమిటో స్పష్టం చేయాలన్నారు.
రామమందిర నిర్మాణంపై కేసీఆర్ వైఖరి చెప్పాలి: లక్ష్మణ్ - రామమందిర నిర్మాణం
మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రాన్ని సీఎం కేసీఆర్ ఎప్పుడూ కోరలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. ములుగు జిల్లా కలెక్టర్లను నలుగురిని మార్చడం వెనక ఉన్న మర్మమేమిటో స్పష్టం చేయాలన్నారు. పండుగ పేరుమీద అందినకాడికి దండుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.
laxman
పండుగ పేరు మీద అందిన కాడికి దండుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. మేడారం జాతర కోసం ఏర్పాటు చేసిన మూడు ప్రత్యేక అంబులెన్స్ వాహనాలను లక్ష్మణ్ ప్రారంభించారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే రామమందిరం నిర్మాణంపై తమ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని కేసీఆర్ ఎప్పుడూ కేంద్రాన్ని కోరింది లేదన్నారు.
ఇదీ చూడండి:'దేశంలో రెండో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌గా హైదరాబాద్ మెట్రో'