తెలంగాణ ప్రజలను వంచించిన నిజాంను సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా పొగడటం సిగ్గుచేటని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. 2023లో భాజపా అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఓ ప్రకటనలో వెల్లడించారు.
కేసీఆర్ అక్రమ ఆస్తులను క్రమబద్ధీకరించుకునేందుకే ఎల్‌ఆర్ఎస్ : బండి - bandi sanjay kumar on nizam
సీఎం కేసీఆర్ అక్రమ ఆస్తులను క్రమబద్ధీకరించుకునేందుకే ఎల్‌ఆర్ఎస్‌ను తీసుకువచ్చారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. తెల్లపాస్‌బుక్‌ను నల్ల పాస్‌బుక్కుగా మార్చడం తప్ప కొత్త రెవెన్యూ చట్టం విషయంలో చేసిందేమీలేదని విమర్శించారు. 2023లో భాజపా అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు.
bandi sanjay
తమ అక్రమ ఆస్తులను క్రమబద్ధీకరించుకునేందుకే ఎల్‌ఆర్ఎస్‌ను కేసీఆర్ తీసుకువచ్చారని ఆరోపించారు. తెల్లపాస్‌బుక్‌ను నల్ల పాస్‌బుక్కుగా మార్చడం తప్ప కొత్త రెవెన్యూ చట్టం విషయంలో చేసేందేమిలేదని విమర్శించారు.
ఇదీ చదవండి:మెదక్ అదనపు కలెక్టర్, నర్సాపురం ఆర్డీవో, తహసీల్దార్ అరెస్టు