తెలంగాణ

telangana

ETV Bharat / city

ఉపవాస దీక్షకు దిగిన బండి సంజయ్‌ - బండి సంజయ్ ఉపవాస దీక్ష

రాష్ట్రంలో రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించడంలేదని... అన్నదాతలకు సంఘీభావంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఉపవాస దీక్ష చేపట్టారు. హైదరాబాద్‌ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో దీక్షకు దిగారు. సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగనుంది.

bandi sanjay
bandi sanjay

By

Published : Apr 24, 2020, 12:15 PM IST

Updated : Apr 24, 2020, 12:33 PM IST

రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనుగోలులో ఆలస్యం అవుతోందని ఆరోపించారు. రైతులకు సంఘీభావంగా బండి సంజయ్‌ ఉపవాస దీక్ష చేపట్టారు. సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. రాష్ట్ర పదాధికారులు, కోర్ కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, ఎవరి ఇంట్లో వారు ఉపవాస దీక్ష చేస్తున్నారు.

ఐకేపీ సెంటర్లలో ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయలేదు. దళారీ వ్యవస్థను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది. క్షేత్రస్థాయిలో మంత్రులు పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయి. రైతుల ఇబ్బందులు గమనించినా ఆదుకోలేని పరిస్థితి. లాక్‌డౌన్‌ నిబంధనల మేరకు నిరసన తెలిపిన రైతులపై కేసులు పెడుతున్నారు. సిరిసిల్లలో రైతులు ధాన్యాన్ని తగులబెట్టుకునే పరిస్థితి వచ్చింది. అన్నదాతలకు భరోసాగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉపవాస దీక్ష చేస్తున్నాం.

-బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇదీ చదవండి:ఒకే కుటుంబంలోని 12 మందికి కరోనా

Last Updated : Apr 24, 2020, 12:33 PM IST

ABOUT THE AUTHOR

...view details