తెలంగాణ

telangana

ETV Bharat / city

'కేటీఆర్​ను సీఎం చేయడానికి కేసీఆర్ దోషనివారణ​ పూజలు చేశారు' - బండి సంజయ్ వార్తలు

సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటనపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు స్పందించారు. కుమారుడు కేటీఆర్‌ను సీఎం చేసేందుకే కేసీఆర్ దోషనివారణ పూజలు చేశారని పేర్కొన్నారు. ఆ పూజ సామగ్రిని గోదావరిలో కలిపేందుకే కాళేశ్వరం వెళ్లారని బండి సంజయ్ తెలిపారు.

bandi sanjay
bandi sanjay

By

Published : Jan 20, 2021, 2:16 PM IST

సీఎం కేసీఆర్ నటిస్తూ... అబద్ధాలతో పదవిని కాపాడుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. వరదలు వస్తే రాని సీఎం కాళేశ్వరం వెళ్లి ఏం సాధించారని ప్రశ్నించారు. కేటీఆర్‌ను సీఎం చేసేందుకు ఫామ్‌హౌస్‌లో పూజలు చేశారన్నారు. మూడ్రోజులపాటు దోషనివారణ పూజలు చేశారని... ఆ పూజ సామగ్రిని త్రివేణి సంగమంలో కలిపేందుకు సతీమణితో కలిసి కేసీఆర్ కాళేశ్వరం వెళ్లారని బండి సంజయ్​ పేర్కొన్నారు.

కాళేశ్వరం 2 టీఎంసీల ద్వారా సీఎం కేసీఆర్ ఏం సాధించారని సంజయ్ ప్రశ్నించారు. మూడో టీఎంసీ అంటూ కొత్తనాటకం ప్రారంభించారని విమర్శించారు. కోట్ల రూపాయలను దోచుకునేందుకు కొత్త నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు.

ఇవీ చదవండి :

'కేటీఆర్​ను సీఎం చేయడానికి కేసీఆర్ దోషనివారణ​ పూజలు చేశారు'

కాళేశ్వరంలో కేసీఆర్... గోదారి జలాలతో అభిషేకం

సాగునీటి గోసకు శాశ్వత పరిష్కారం: సీఎం కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details