తెలంగాణ మారుతుందని.. ఎక్కడికెళ్లినా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌చుగ్ అన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందని.. సంపద దోచుకునే పనిలో ఉందని ఆరోపించారు.
కరోనా సమయంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని తరుణ్‌చుగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు అవస్థలు పడినా.. రాష్ట్ర రాజాబాబు సెవన్‌స్టార్ ఫాంహౌస్ నుంచి ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు.. ఒక్క ఆస్పత్రి.. ఒక్క రిక్షావాలా కుటుంబాన్నీ ముఖ్యమంత్రి పరామర్శించలేదు. ప్రజలను కష్టాలు పెట్టే వాడు కాదు.. కష్టాలు తీర్చే వాడు కావాలి. నిజాం సాహి సర్కార్ ఇక్కడ నడుస్తోంది. భాజపా సీఎం.. సచివాలయానికి ఎందురు రారు. మోడీ ప్రభుత్వం ఏమి చేసిందో.. తెరాస సర్కారు ఏం చేసిందో చర్చకు సిద్ధం. భాజపాని ఆపడం కోసమే గ్రేటర్ ఎన్నికలు తొందరగా పెట్టారు. వచ్చే సాధారణ ఎన్నికల తర్వాత సామాన్యుడు ముఖ్యమంత్రి అవుతారు. రాజబాబు మేలుకో... ఇచ్చిన హామీలు నెరవేర్చు.