జీహెచ్‌ఎంసీ పోరు: జాతీయ నేతలతో భాజపా పర్యవేక్షణ కమిటీ - ghmc elections news
![జీహెచ్‌ఎంసీ పోరు: జాతీయ నేతలతో భాజపా పర్యవేక్షణ కమిటీ TELANGANA BJP APPOINTS COMMITTEE FOR GHMC ELECTIONS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9551974-15-9551974-1605444940253.jpg)
17:27 November 15
జీహెచ్‌ఎంసీ పోరు: జాతీయ నేతలతో భాజపా పర్యవేక్షణ కమిటీ
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికలపై భాజపా ప్రత్యేక దృష్టిసారించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు జాతీయ నాయకులతో కమిటీ వేసింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ముఖ్యనేతలు సమావేశమయ్యారు. బల్దియా పోరులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల పర్యవేక్షకుడిగా ఎంపీ భూపేందర్‌యాదవ్ సహా మరో నలుగురు సభ్యుల్ని నియమించారు. జీహెచ్‌ఎంసీ భాజపా ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యవహరించనున్నారు. కన్వీనర్‌గా లక్ష్మణ్, కో-కన్వీనర్లుగా జి.వివేక్, గరికపాటి మోహన్‌రావు నియమించారు.
ఇవీచూడండి:'గ్రేటర్‌లోనూ దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలే'