తెలంగాణ

telangana

ETV Bharat / city

'కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి' - మేడారం జాతర 2020

దేశంలోనూ, రాష్ట్రంలోనూ రోజు రోజుకూ పారిశ్రామిక కాలుష్యం పెరిగిపోతుందని తెలంగాణ బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ బిఎస్‌ రాములు ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏడాది కోట్లాది మొక్కలను నాటుతుందన్నారు.

plastic ban latest news
plastic ban latest news

By

Published : Jan 28, 2020, 5:09 PM IST

కాలుష్యాన్ని పెంచుతున్న మనమే కాలుష్యాని నివారణ చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ బీసీ కమిషన్​ రాములు పేర్కొన్నారు. కాలుష్య నివారణ కోసం ప్రతి ఒక్కరు ఏడాదికి వంద మొక్కలను నాటి వాటిని పరిరక్షించాలని ఆయన కోరారు. మేడారం మహాజాతరను పర్యావరణ పరిరక్షణ హితంగా జరుపుకోవాలంటూ.... ప్రపంచ పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌ స్వచ్ఛ మేడారం గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు.

ప్రపంచ పర్యావరణ సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా క్లీన్‌ మేడారం, గ్రీన్‌ మేడారం, సేవ్‌ మేడారం పేరిట ప్రజలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని రాములు అన్నారు. ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు జరగనున్న మేడారం మహాజాతరలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని కోరారు.

'కాలుష్య నివారణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి'

ఇవీ చూడండి: రుణాలు సేకరించి ప్రాజెక్టులు కట్టాం.. నిధులివ్వండి: హరీశ్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details