అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా - తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
15:57 September 16
అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా
అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. కరోనా కేసులు పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నాంపల్లి శాసనసభ్యుడు జాఫర్ హుస్సేన్, పలువురు శాసనసభ సిబ్బంది, పాత్రికేయులు, పోలీసులు, గన్‌మెన్లు, డ్రైవర్లు.. ఇలా మొత్తం 52 మందికి పైగా వైరస్ సోకిన విషయాన్ని శాసనసభ్యులు కొందరు సభాపతి పోచారం దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం నిర్వహించిన బీఏసీ సమావేశంలో పార్టీల అభిప్రాయాల అనంతరం సమావేశాల కుదింపునకు నిర్ణయించారు.
ఇవాళ ప్రశ్నోత్తరాలు, జీహెచ్‌ఎంసీ, దాని పరిసర పురపాలికల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతులపై స్వల్పకాలిక చర్చ జరిగింది. అనంతరం శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. శాసనమండలిని ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వాయిదా వేశారు. సమావేశాల అనంతరం కూడా సభ్యులు కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.
ఇదీ చూడండి:ఎల్‌ఆర్‌ఎస్ జీవో సవరించి రేపు విడుదల చేస్తాం : కేటీఆర్